TG TET 2025 January Notification: టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) జనవరి 2025 కోసం తెలంగాణ పాఠశాల విద్యా విభాగం అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఉద్యోగం పొందాలనుకునే వారికోసం ఈ నోటిఫికేషన్ చాలా ముఖ్యమైనది. క్రింద TET జనవరి 2025 కు సంబంధించిన పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది.
ముఖ్యమైన తేదీలు:
నోటిఫికేషన్ విడుదల తేదీ: 4 నవంబర్ 2024
నమోదు ప్రారంభ తేదీ: 5 నవంబర్ 2024
నమోదు చివరి తేదీ: 20 నవంబర్ 2024
అడ్మిట్ కార్డ్ లభ్యత: 15 డిసెంబర్ 2024
పరీక్ష తేదీలు: జనవరి 1 నుండి 20, 2025
ఫలితాల ప్రకటన: 15 ఫిబ్రవరి 2025

అర్హత ప్రమాణాలు:
TG TET 2025 January Notification కోసం దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు క్రింద పేర్కొన్న అర్హతలను కలిగి ఉండాలి:
- విద్యార్హత:
- పేపర్-I (తరగతులు I నుండి V): అభ్యర్థులు కనీసం 50% మార్కులతో ఇంటర్మీడియట్ / సీనియర్ సెకండరీ (లేదా దానికి సమానమైన) ఉత్తీర్ణులై ఉండాలి మరియు 2 సంవత్సరాల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (D.El.Ed) లేదా 4 సంవత్సరాల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (B.El.Ed) చివరి సంవత్సరంలో ఉత్తీర్ణులై ఉండాలి.
- పేపర్-II (తరగతులు VI నుండి VIII): అభ్యర్థులు కనీసం 50% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి మరియు 2 సంవత్సరాల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (D.El.Ed) లేదా 1 సంవత్సరం బ్యాచిలర్ ఇన్ ఎడ్యుకేషన్ (B.Ed) చివరి సంవత్సరంలో ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు ప్రక్రియ:
TS TET జనవరి 2025 నోటిఫికేషన్ కోసం దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లో ఉంటుంది. అభ్యర్థులు క్రింది విధంగా అప్లై చేసుకోవాలి :
- అధికారిక వెబ్సైట్ schooledu.telangana.gov.in ఓపెన్ చేయండి.
- నమోదు విధానం : TS TET 2024 రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేసి, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ , ఇమెయిల్ ID, మొబైల్ నంబర్ వంటి వివరాలను అందించి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోండి .
- లాగిన్: రిజిస్ట్రేషన్ క్రెడెన్షియల్స్ ఉపయోగించి పోర్టల్‌లో లాగిన్ అవ్వండి.
- అప్లికేషన్ ఫారమ్ : మీ వివరాలు , విద్యా మరియు ఇతర అవసరమైన వివరాలను నమోదు చేసి అప్లికేషన్ ఫారమ్‌ను పూర్తి చేయండి.
- కావాల్సిన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయడం : మీ ఫోటో మరియు సంతకం స్కాన్ చేసిన కాపీలను తగిన ఫార్మాట్ లలో అప్లోడ్ చేయండి.
- అప్లికేషన్ ఫీజు చెల్లింపు: క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఆన్లైన్ మోడ్‌లో అప్లికేషన్ ఫీజు చెల్లించండి.
- అప్లికేషన్ సబ్మిట్ చేయండి : అప్లికేషన్ ఫారమ్ లోని వివరాలు ఒకసారి పూర్తిగా చూసుకుకొని అన్నీ సరిగ్గా ఉంటే అప్లికేషన్ ని సబ్మిట్ చేయండి . భవిష్యత్తు అవసరం అవుతుంది గనక అప్లికేషన్ని సేవ్ చేసుకోండి / ప్రింట్ తీసుకోండి.
TG TET 2025 January Notification అప్లికేషన్ ఫీజు:
- సాధారణ/OBC అభ్యర్థులు: ఒక పేపర్‌కు ₹500 మరియు రెండు పేపర్లకు ₹800 చెల్లించాలి.
- SC/ST/PH అభ్యర్థులు: ఒక పేపర్‌కు ₹250 మరియు రెండు పేపర్లకు ₹400 చెల్లించాలి
ఎంపిక విధానం:
- పేపర్-I:
- పరీక్ష సమయం : 2.5 గంటలు
- మొత్తం మార్కులు: 150
- సబ్జెక్ట్స్: చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగీ, లాంగ్వేజ్ I, లాంగ్వేజ్ II (ఇంగ్లీష్), మ్యాథమెటిక్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్.
- పేపర్-II:
- పరీక్ష సమయం: 2.5 గంటలు
- మొత్తం మార్కులు: 150
- సబ్జెక్ట్స్: చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగీ, లాంగ్వేజ్ I, లాంగ్వేజ్ II (ఇంగ్లీష్), మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ లేదా సోషల్ స్టడీస్.
అడ్మిట్ కార్డ్:
అభ్యర్థులు , TS TET జనవరి 2025 నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ ద్వారా 15 డిసెంబర్ 2024 నుండి తమ అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డ్‌లో అభ్యర్థి పేరు, రోల్ నంబర్, పరీక్ష కేంద్రం మరియు పరీక్ష సమయాలు వంటి ఇవ్వడం జరుగుతుంది.
ఫలితాలు :
TG TET 2025 January Notification: 15 ఫిబ్రవరి 2025 TS TET జనవరి 2025 ఫలితాలు న ప్రకటించబడతాయి. అభ్యర్థులు తమ రోల్ నంబర్ మరియు ఇతర అవసరమైన వివరాలను నమోదు చేసి అధికారిక వెబ్సైట్లో ఫలితాలను చూసుకోవచ్చు.
మరిన్ని సమాచారంల కోసం మరియు అప్ డేట్ల కోసం, అభ్యర్థులు మన వెబ్సైట్ ని బుక్ మార్క్ చేసుకోండి మరియు తరుచుగా మన వెబ్సైటు ని సందర్శించండి.
TG TET 2025 January Notification ముఖ్యమైన సమాచారం | |
Join Telegram Channel | Click Here |
OFFICIAL WEB SITE | Click Here |
DOWNLOAD NOTIFICATION | Click Here |